ఈ ఆగస్ట్ 15 న మొట్టమొదటి సారిగా కాశ్మీర్ లోనూ మన జాతీయ జండా ఎగురవేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాజమండ్రి లోని “అఖిల్ హోటల్ మానేజ్మెంట్ కాలేజ్” విద్యార్థులు కాలేజ్ ఆవరణలోనే “కాశ్మీర్”డెకొరేషన్ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన BJP రాష్ట్ర నాయకురాలు మరియు మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కొత్తపల్లి గీత గారు జాతీయ జెండాను ఎగురవేశారు.వారితో పాటుగా ఈ జెండా వందనం కార్యక్రమానికి BJP నాయకులు మరియు సినీనటి శ్రీమతి కవిత గారు,శ్రీమతి రోజా రమణి గారు,శ్రీ అడపా వరప్రసాద్ గారు పాల్గొన్నారు.

73 వ. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా రాజమండ్రి లోని “అఖిల్ హోటల్ మానేజ్మెంట్ కాలేజ్” స్టూడెంట్స్…. మువ్వన్నెల రంగులలో భారతదేశ మ్యాప్ ఆకారం లో “100కేజీల హాల్వా స్వీట్”తయారు చేసి,అనాధ శరణాలయంలోను,వృద్ధాశ్రమాలలోను ఉచితంగా పంచిపెట్టారు.